
జనరల్

తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని స్పష్టం చేశారు. విజయ్, డీఎంకే, ఏఐఏడీఎంకే ఎవరైనా సరే సంఖ్యాబలం నిరూపించాల్సిందే అని ఆయన తెలిపారు. స్పష్టత లేని సమీకరణాలు హార్స్ ట్రేడింగ్‌కు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు.
అవసరమైన మెజారిటీ మద్దతు లేఖల ద్వారా నిరూపితమైతే వెంటనే ప్రమాణ స్వీకారం చేయవచ్చని ఆయన అన్నారు. కొన్ని సందర్భాల్లో అసెంబ్లీలోనే ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని, ఇది మెజారిటీ బలం మరియు చట్టపరమైన మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుందని రాజేంద్ర ఆర్లేకర్ పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!