
జనరల్

విజయ్ తమిళనాడు ప్రభుత్వంలో ఓఎస్డీగా రాధా పండిత్ నియామకాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. జ్యోతిష్యానికి సంబంధం ఉన్న వ్యక్తిని కీలక పదవిలో నియమించడంపై వామపక్షాలు సహా పలువురు రాజకీయ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రేమలత సహా పలువురు నేతలు యువత శాస్త్రీయ ఆలోచనతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న సమయంలో ఇలాంటి నియామకాలు సరైన సందేశం ఇవ్వవని విమర్శించారు. యువత మీకు ఓటు వేసి గెలిపించిందని, జ్యోతిష్కులను నమ్ముకుని పాలన చేయవద్దని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!