

దళిత స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు చెబుతున్న అనుచిత వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, శాసన వ్యవస్థ గౌరవానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. శాసనసభ స్పీకర్ పదవి అత్యంత గౌరవప్రదమైనదని, ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై కులపరమైన లేదా అవమానకర వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తాతా మధు తన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
శాసన మండలి నిబంధనల ప్రకారం తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయనను సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు స్థానం ఉన్నప్పటికీ వ్యక్తిగత అవమానాలు, కుల వివక్షకు తావు లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ ఘటనపై స్పందించి తాతా మధు వ్యాఖ్యలను ఖండించడంతో పాటు స్పీకర్‌కు, దళిత సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాసన వ్యవస్థ ప్రతిష్ఠను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!