

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీంతో కేసు పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఫిరాయింపుల అంశంపై దాఖలైన మొత్తం 10 పిటిషన్లను స్పీకర్ ఇప్పటికే పరిష్కరించారని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. సంబంధిత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తేల్చిచెప్పినట్లు ఆయన వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రతులను రెండు రోజుల్లోగా ఫిర్యాదుదారులకు అందజేయాలని ఆదేశించింది. స్పీకర్ నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ఈ పిటిషన్లపై విచారణ ముగిసినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!