

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) పై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఈ ఒప్పందానికి సంబంధించిన మధ్యంతర అవగాహన పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి బీటీఏలో భాగమైన న్యాయపరమైన అంశాలపై మరింత స్పష్టతకు చర్చలు కొనసాగించేందుకు భారత ప్రతినిధి బృందం ఈ నెల 23 న అమెరికా పర్యటనకు వెళ్లనుందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగ్రవాల్ సోమవారం మీడియాకు వెల్లడించారు.
భారత్ తరఫున చర్చలను నడిపిస్తున్న ప్రధాన ప్రతినిధి, వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి దర్పన్ జైన్ నేతృత్వంలో ఈ బృందం అమెరికా అధికారులతో సమావేశమవుతుంది. బీటీఏ అమలు ప్రక్రియలో కీలకమైన న్యాయపరమైన అంశాలు, ఒప్పంద నిబంధనలపై ఇరుదేశాల ప్రతినిధులు సవివరంగా చర్చించనున్నారు.
ఈ చర్చలు సానుకూలంగా ముగిస్తే, భారత్–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!