
జనరల్

అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై సైనిక చర్యల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలను పరిమితం చేస్తూ అమెరికా సెనేట్ చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా అమెరికా సైనిక బలగాలను ఇరాన్‌తో ఘర్షణల్లోకి దించకూడదని ఈ తీర్మానం స్పష్టం చేసింది. ట్రంప్ పరిపాలన నిర్ణయాలపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు నమోదయ్యాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సెనేటర్లు డెమోక్రాట్లకు మద్దతు ఇవ్వగా, డెమోక్రటిక్ సెనేటర్ జాన్ ఫెటర్‌మన్ వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రతినిధుల సభలో కూడా ఈ బిల్లు 215-208 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!