
షోస్

మాజీ ‘తెహల్కా’ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ 2013 అత్యాచారం కేసులో తనకు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆగస్టు 6న బాంబే హైకోర్టు గోవా బెంచ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు, తేజ్‌పాల్‌కు జీవిత ఖైదు విధించాలని కోరుతూ గోవా ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఒకే కేసులో తేజ్‌పాల్, గోవా ప్రభుత్వం వేర్వేరు అభ్యర్థనలతో సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో క్రాస్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ కీలకంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!