

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ రాజకీయాల్లో ఎప్పుడూ ఫుల్స్టాప్ ఉండదని స్పష్టం చేశారు. రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేస్తున్న 59 మంది సభ్యులకు వీడ్కోలు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ను ఒక సార్వత్రిక విశ్వవిద్యాలయంగా అభివర్ణించారు. సభ్యులు తమ అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం కొనసాగించాలని సూచించారు. రిటైర్మెంట్ అనేది ముగింపు కాదని, భవిష్యత్తులో కూడా సేవలకు అవకాశాలు ఉంటాయని తెలిపారు. మాజీ ప్రధాని దేవెగౌడ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్ వంటి నేతల సేవలను ఆయన ప్రశంసించారు.
పార్లమెంట్లో రెండు సభలు ఉండటం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఒక అంశంపై వివిధ కోణాల్లో చర్చించేందుకు ఇది సహాయపడుతుందని చెప్పారు. సభ్యుల అనుభవం దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సభలో హాస్యభరిత సంభాషణలు తగ్గినా, ప్రజాస్వామ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఖర్గే, దేవెగౌడ మధ్య జరిగిన సరదా వ్యాఖ్యలు సభలో నవ్వులు పంచాయి.




















.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!