

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీవ్‌గాంధీని దేశం కోసం ప్రాణాలర్పించిన మహానాయకుడిగా కొనియాడారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయంలోని ఆయన విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశానికి సాంకేతిక విప్లవాన్ని అందించిన దార్శనికుడు రాజీవ్‌గాంధీ అని అన్నారు. కంప్యూటర్, ఐటీ, టెలికామ్ రంగాలను దేశానికి పరిచయం చేసింది ఆయనే అని గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత కూడా ఆయనదేనని తెలిపారు.
గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, రాహుల్‌గాంధీ కుటుంబం సేవలను ప్రశంసించారు. తెలంగాణ సాకారానికి సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే కారణమని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును డీలిమిటేషన్‌తో అనుసంధానం చేసి మోదీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలంటూ సీఎం డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!