
జనరల్

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు. “జై శ్రీరామ్ అంటే పై నుంచి పైసలు పడతాయా” అని సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి భక్తుల మనోభావాలను గౌరవించాలని సూచించారు.
గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో “జై శ్రీరామ్” నినాదాలు చేశారని రాజా సింగ్ గుర్తు చేశారు. ఇప్పుడు మీ మంత్రికి ఆ విషయాన్ని నేర్పించలేదా అని ప్రశ్నించారు. హిందూ భావజాలాన్ని అవమానించే వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!