
న్యూస్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు కేరళలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కన్నూరులో నిర్వహించే సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం కల్లాచి మరియు పెరంబ్రా ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్‌లలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
ఇక బలుస్సేరి నుంచి నన్మండ వరకు లబ్ధిదారులతో కలిసి బస్సు యాత్రలో కూడా ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం కోయిలాండి నుంచి కొల్లాం వరకు భారీ రోడ్‌షో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలతో నేరుగా మమేకమవుతూ పార్టీకి మద్దతు కూడగట్టేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించనున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!