

ఓటు చోరీ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ధర్నా చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీఎం రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ గాంధీ ఓటు చోరీపై నిరసన చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఈ విషయంలో ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన కూడా కాంగ్రెస్ నేతలకు లేదని ఎద్దేవా చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలో కొనసాగడానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజకీయ వైఖరే కారణమని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరుతో మోదీకి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేదని, ఆయన ఉంటే చాలని మోదీ భావించే పరిస్థితి ఉందని విమర్శించారు. తాను చెబుతున్నది వాస్తవమని, ఇందులో ఎలాంటి అబద్ధం లేదని పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!