

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పట్టణ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వ సూచనల మేరకు నీటిని పొదుపుగా వినియోగించాలని, ప్రతిరోజూ నల్లాల ద్వారా సరఫరా చేసే నీటిని అవసరమైనంత మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
ప్రతి ఇంట్లో నీటిని నిల్వ చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, నీటిని వృథా చేయకుండా సాధ్యమైనంతవరకు తిరిగి వినియోగించాలని చైర్మన్ సూచించారు. ఇళ్లను శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి ఉపయోగించిన నీటిని ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని కోరారు. అలాగే, ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయంలో బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!