

ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న 'ఛలో ఢిల్లీ' కార్యక్రమంలో పాల్గొనేందుకు కరీంనగర్ నుంచి సుమారు 40 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరగనున్న 'ఓట్ బచావో.. దేశ్ బచావో.. సేవ్ డెమోక్రసీ.. సేవ్ ఇండియా' ర్యాలీలో పాల్గొనేందుకు వారు బస్సులో ఢిల్లీకి పయనమయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ కాంగ్రెస్ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ, ఓటు హక్కు స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమానికి కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. ఢిల్లీలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ అలీ, నాత శ్రీనివాస్, షాబాజ్ ఖాన్, షేక్ అజీముద్దీన్, యాకూబ్ పాషా తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!