
.webp&w=3840&q=75)
మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన జీ రామ్ జీ బిల్లు ఉపాధి హామీ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదివారం ఆమోదం ప్రకటించారు. దీనితో ఈ బిల్లు చట్టంగా మారింది. గతంలో MGNREGA ద్వారా 100 రోజులు పని దినాలు కల్పించేవాళ్లకు, ఇప్పుడు 125 రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో అవసరమున్న వారికి పనిదినాలు కల్పించే లక్ష్యంతో జీ రామ్ జీ బిల్లు ఉపాధి హామీ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.
ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ముందుకు తెచ్చి చర్చించారు. లోక్సభలో 8 గంటల చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించగా, వెంటనే రాజ్యసభకు పంపి 4 గంటల చర్చ తర్వాత ఓటుల ద్వారా ఆమోదం పొందింది. చర్చకు తగిన సమయం ఇవ్వలేదని విపక్షాలు రాజ్యసభలో వాకౌట్ అయ్యాయి. ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో జీ రామ్ జీ బిల్లు ఉపాధి హామీ బిల్లు చట్టంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!