
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 19 మున్సిపల్ చైర్‌పర్సన్ పదవుల కోసం 134 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 707 కౌన్సిలర్ స్థానాలకు 2,057 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 13.53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 14 వేల మంది సిబ్బందిని విధుల్లో నియమించారు. ఓటింగ్ పూర్తయిన అనంతరం ఈ నెల 30న నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఫలితాలపై రాజకీయ పార్టీలతోపాటు అభ్యర్థుల్లోనూ ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!