
క్రీడలు

దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా వెండిపై అమ్మకాల ఒత్తిడి పెరగడంతో దాని ధర ఏడాది క్రితం స్థాయులకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గరిష్ఠ స్థాయులకు చేరడం, అమెరికా పరపతి విధానం కఠినంగా ఉండొచ్చన్న అంచనాలు విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మదుపర్లు పసిడి, వెండి వంటి లోహాల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ధరల తగ్గుదలకు కారణమైంది.
మరోవైపు పారిశ్రామిక లోహాల మార్కెట్లో నెలకొన్న బలహీనత కూడా వెండి ధరపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రాత్రి 11:30 గంటల సమయానికి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల పసిడి ధర రూ.1,25,600 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ.1,46,700గా నమోదైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!