
జనరల్

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం బీజేపీ కుట్ర అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని, ప్రజల గొంతులను అణచివేయడమేనని ఆయన విమర్శించారు.
తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. గెలవలేకనే కుట్ర చేసి నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. జైరాం రమేష్ నేతృత్వంలోని కాంగ్రెస్ నాయకులను ఈసీ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని, దీనిని కోర్టులో సవాలు చేసి న్యాయం కోసం పోరాడతామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!