
జనరల్

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తన సినీ ప్రయాణం ఎలా ప్రారంభమైందో తాజాగా ఆసక్తికరంగా వెల్లడించారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో తాను సినిమాల్లోకి రావాలనే ఆలోచన అసలు లేదని, అయితే అనుకోకుండా కన్నడ చిత్రం గిల్లీలో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. ఆ సినిమా కోసం నిర్మాతలు రూ. 5 లక్షల పారితోషికం ఇస్తామని చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆ సమయంలో కారు కొనడం తన పెద్ద కల అని, అదే ఆఫర్‌ను అంగీకరించడానికి ప్రధాన కారణమైందని రకుల్ వెల్లడించారు. ఆ డబ్బుతో తన స్నేహితుల కంటే ముందుగానే కారు కొనుగోలు చేశానని చెప్పారు. అనంతరం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్టి వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె ప్రయాణం ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!