
జనరల్

సినీ పరిశ్రమలో 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నటి, గాయని శృతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా, గత 15 ఏళ్లుగా ఇదే ప్రశ్నకు సమాధానం చెబుతున్నానని, ఇకపై దయచేసి అలాంటి ప్రశ్నలు అడగవద్దని ఆమె నవ్వుతూ చెప్పారు.
ప్రస్తుతం తనకు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచనలు లేవని, తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని శృతి స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రైన్, సలార్ 2, ఆకాశంలో ఒక తార వంటి చిత్రాల్లో నటిస్తున్న ఆమె, త్వరలోనే తన కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్‌లను అభిమానులతో పంచుకుంటానని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!