

నీట్ పేపర్ లీక్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) భవితవ్యంపై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 అక్టోబర్ 31 వరకు సీజేపీకి విపరీతమైన ప్రజాదరణ ఉంటుందని, ఆ తర్వాత మరో దశలో కొత్త రకమైన క్రేజ్ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. భవిష్యత్తులో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఈ పార్టీ ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉందని, అయితే అది నీట్ వివాదానికే సంబంధించి ఉంటుందో లేదో చెప్పలేనని వేణుస్వామి అన్నారు. సీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు జైలుకు వెళ్లే అవకాశముందని, ఈ పార్టీ ఎదుగుదల బీజేపీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి రాజకీయ సవాళ్లు తీసుకురావొచ్చని పేర్కొన్నారు. ఇవన్నీ తన జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా చేసిన అంచనులేనని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!