
జనరల్

భోనాలు, బతుకమ్మ, మహాశివరాత్రి వంటి పండుగల సందర్భంగా ప్రత్యేక పాటలను విడుదల చేస్తూ సింగర్ మంగ్లీ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఒకప్పుడు ఆమె పాటల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. అయితే ఈసారి విడుదలైన భోనాల స్పెషల్ సాంగ్‌కు ప్రశంసలతో పాటు సోషల్ మీడియాలో విమర్శలు కూడా ఎదురవుతున్నాయి.
ఇటీవల ఆమె పేరు ఒక వివాదంలో వినిపించిన నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు ఈ పాటను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఆ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఆమెపై ఎలాంటి అధికారిక నిర్ధారణ లేకపోయినా సోషల్ మీడియాలో విమర్శలు కొనసాగుతుండగా, వాటిపై స్పందించకుండా తన పనిపైనే దృష్టి సారిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!