

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా తెరకెక్కుతున్న రామాయణం దాదాపు రూ. 4,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సోనీ పిక్చర్స్ దక్కించుకోగా, ప్రపంచవ్యాప్తంగా సినిమాను చేరవేయడానికి సుమారు రూ. 375 కోట్ల ప్రమోషన్ క్యాంపెయిన్ సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది.
ఈ స్థాయి ప్రమోషన్ బడ్జెట్ భారతీయ సినిమా చరిత్రలోనే అరుదైనదిగా భావిస్తున్నారు. నిర్మాతల వాటా మాత్రమే సుమారు రూ. 140 కోట్ల వరకు ఉంటుందని టాక్. ఇదిలా ఉండగా, శుక్రవారం విడుదల కావాల్సిన ట్రైలర్ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, ఈ పరిణామం సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!