26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

Writer: Pooja 06:03 PM, 26 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

బిగ్ బాస్ తెలుగు హౌస్‌లో మూడో వారం నామినేషన్లు, ఎలిమినేషన్ చుట్టూ జరుగుతున్న ప్రచారంతో డ్రామా, మైండ్ గేమ్స్ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇదే సమయంలో ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్లు అపూర్వ, మిథిలేష్ ఊహించని విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో హౌస్‌లో కొత్త ట్విస్ట్ మొదలైంది. సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం టెంపర్ వంశీ ప్రస్తుతం ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాస్కుల్లో దూకుడుగా వ్యవహరించడం, తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పడం ఆయనకు మంచి స్క్రీన్ స్పేస్ తెచ్చిపెట్టినప్పటికీ, మాట తీరు కొంతమంది ప్రేక్షకుల్లో ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరోవైపు బిగ్ బాస్ హౌస్ తొలి కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ కూడా ఈ వారం బాటమ్ రేసులో ఉన్నట్లు సోషల్ మీడియా ట్రెండ్స్ చెబుతున్నాయి. కెప్టెన్సీ దక్కిన వెంటనే నామినేషన్లలోకి రావడం, ఓటింగ్‌లో వెనుకబడినట్లు ప్రచారం జరగడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ట్రెండ్స్ నిజమై వంశీ ఈ వారాంతంలో ఎలిమినేట్ అయితే, అది హౌస్ సభ్యులకు ఊహించని షాక్‌గా మారే అవకాశం ఉంది. అయితే అధికారిక ఓటింగ్ ఫలితాలు, ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఎలిమినేషన్‌పై స్పష్టత రాదు.

అపూర్వ, మిథిలేష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో మరింత ఉత్కంఠ నెలకొంది. కామనర్ కంటెస్టెంట్ల మధ్య ఉన్న విభేదాలు, ఒకరిపై ఒకరికి ఉన్న అసంతృప్తిని వీరిద్దరూ ప్రస్తావించడంతో గ్రూప్‌లో కొత్త అనుమానాలు మొదలైనట్లు తెలుస్తోంది. నామినేషన్ల భయం, ఎలిమినేషన్ ఉత్కంఠ, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వారాంతంలో నాగార్జున ఎలాంటి స్పందన ఇస్తారు, చివరకు ఓటింగ్ ట్రెండ్స్ మారతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

బిగ్‌బాస్ తెలుగు డే 19 ఎపిసోడ్ 20 రివ్యూ.. ముఖేష్ కెప్టెన్, అపూర్వకు ఇమ్యూనిటీ !

బిగ్‌బాస్ తెలుగు డే 19 ఎపిసోడ్ 20 రివ్యూ.. ముఖేష్ కెప్టెన్, అపూర్వకు ఇమ్యూనిటీ !

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?

బిగ్ బాస్ తెలుగు 10: ‘కన్నింగ్‌’, ‘మానిప్యులేటివ్‌’ కామెంట్స్‌.. హౌస్‌లో పెరిగిన వేడి

బిగ్ బాస్ తెలుగు 10: ‘కన్నింగ్‌’, ‘మానిప్యులేటివ్‌’ కామెంట్స్‌.. హౌస్‌లో పెరిగిన వేడి

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ సీజన్ 10టెంపర్ వంశీఅపూర్వమిథిలేష్నాగార్జున
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన
జనరల్

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్
క్రీడలు

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2
గాసిప్స్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా
జనరల్

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి
జనరల్

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
జనరల్

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్
జనరల్

ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

ఎస్‌ఐఆర్‌పై ఈసీఐ కీలక భేటీ
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీఐ కీలక భేటీ

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్
షోస్

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్
షోస్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడి అనుమానాస్పద మృతి
జనరల్

ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడి అనుమానాస్పద మృతి

కల్తీ మద్యం ఘటనతో నాగాలాండ్‌లో విషాదం
జనరల్

కల్తీ మద్యం ఘటనతో నాగాలాండ్‌లో విషాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!