

నరేంద్ర మోదీ వచ్చే నెల రెండో వారంలో తెలంగాణ పర్యటనకు రానున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో ప్రధాని మోదీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. సభ విజయవంతం కోసం బీజేపీ నేతలు భారీ స్థాయిలో జన సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు, ములుగులో నిర్మిస్తున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్ ఎయిమ్స్‌లో కొత్త హాస్టల్ భవనాలు, మెగా టెక్స్టైల్ పార్క్‌లోని కీలక విభాగాలు, ఖమ్మం - దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి వంటి ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు సమాచారం. మామునూరు విమానాశ్రయానికి కూడా శంకుస్థాపన చేసే అవకాశంపై చర్చ జరుగుతోంది.




.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!