
క్రీడలు

నరేంద్ర మోదీ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ తో ఫోన్లో మాట్లాడి అభినందించినట్లు సమాచారం. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు మోదీ ఎక్స్ వేదికగా కూడా విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జోసెఫ్ విజయ్, కాంగ్రెస్ సహా పలు పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం లో నేడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!