

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీకి ఓటర్లు బుద్ధి చెప్పాలని తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు శ్రీకాంత్‌గౌడ్, ఆకాశ్ కొల్లూరు ఎన్నికల ప్రచార వాహనాలను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. కొంతమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీల మధ్య అవగాహన ఉందని ఆరోపించారు. కలిసి వచ్చే పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
తెలంగాణ రక్షణసేన పార్టీ ఎన్నికల సంఘం వద్ద అధికారికంగా నమోదైందని కవిత తెలిపారు. పార్టీకి సంబంధించిన అభ్యంతరాలు, ఇతర సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది పట్టభద్రులు ఉన్నప్పటికీ, వారిలో 10 లక్షల మంది కూడా ఓటర్లుగా నమోదు చేసుకోలేదని పేర్కొన్నారు. అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు ప్రాధాన్యతను గుర్తించి ముందుకు రావాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నట్లు ఆమె వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!