
క్రీడలు

అమరావతిలోని పెనుమాక గ్రామ రైతులు భూ సేకరణ అంశంపై ప్రెస్‌మీట్ నిర్వహించి తమ సమస్యలను వెల్లడించారు. వైసీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ, అధికారులు నిర్దిష్ట నిబంధనలు పాటించకుండా భూ సేకరణ చేపడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు పేర్కొంటూ, పరిహారం చెల్లించకుండా భూములను స్వాధీనం చేసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
అధికారులు తమను బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు. తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందించడం లేదని, సీఆర్డీఏ అధికారులు ఒకలా, జిల్లా యంత్రాంగం మరోలా వ్యవహరిస్తోందని విమర్శించారు. భూ సేకరణ ప్రక్రియలో పారదర్శకత పాటించి, చట్టబద్ధమైన విధానంలో ముందుకు వెళ్లాలని, రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!