
సినిమాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాల్లో లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు పలు సందర్భాల్లో వాయిదాలతో సాగాయి. ప్రతిపక్షాల నిరసనలు, వివిధ అంశాలపై ఆందోళనల కారణంగా ఉభయ సభలు సజావుగా కొనసాగలేకపోయాయి.
ఈ సమావేశాల సందర్భంగా పలు కీలక బిల్లులు విస్తృత చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు సమాచారం. దీంతో పార్లమెంట్ సమావేశాల నిర్వహణ, బిల్లుల ఆమోదంపై రాజకీయంగా చర్చకు దారితీసింది. మొత్తంగా 19 రోజుల సమావేశాల్లో 18 రోజులు వాయిదాలతో సాగడం ప్రాధాన్యం సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!