

మెదక్ పట్టణంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో అర్హులైన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి ఇళ్ల పట్టాలు కేటాయిస్తున్నారని ఆమె విమర్శించారు.
ఈ విషయంపై సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రాజకీయాలకు అతీతంగా నిజమైన అర్హులైన నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని కోరారు. అర్హులకు న్యాయం జరగకపోతే మెదక్ పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అలాగే రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు మరో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆంజనేయులు, బట్టి ఉదయ్, జుబేర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!