
సినిమాలు

ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. మాలుకు ప్రావిన్స్‌లోని టియాకుర్‌కు ఈశాన్య దిశగా 87 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి సుమారు 141 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది.
భూకంప కేంద్రం భూమి లోపల అధిక లోతులో ఉండటంతో ప్రకంపనల ప్రభావం పరిసర ప్రాంతాల్లో ఎలా ఉందనే అంశంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!