23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పట్టాలెక్కిన సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్..!

Writer: Harika S 02:47 PM, 23 నవంబర్, 2026
పట్టాలెక్కిన సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్..!

భారత్, నేపాల్ మధ్య రైల్వే అనుసంధానంలో మరో కీలక అడుగు పడింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్‌తో అనుసంధానిస్తూ సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. నవంబర్ 23న ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ రైలుకు పచ్చజెండా ఊపారు. అయోధ్యలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. శ్రీరాముడితో అయోధ్యకు, సీతాదేవితో జనక్‌పూర్‌కు ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం నేపథ్యంలో ఈ రైలు సేవకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ రైలు అయోధ్య కంటోన్మెంట్ నుంచి జనక్‌పూర్ ధామ్ వరకు సుమారు 604 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 19 గంటల్లో చేరుకుంటుంది. వారానికి ఒకసారి ఇరువైపులా నడిచే ఈ రైలు సాధారణ ప్రయాణికులకు నవంబర్ 28 నుంచి అందుబాటులోకి రానుంది. ప్రతి సోమవారం సాయంత్రం 5:50 గంటలకు అయోధ్య కంటోన్మెంట్ నుంచి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12:40 గంటలకు జనక్‌పూర్ ధామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం మధ్యాహ్నం 1:10 గంటలకు జనక్‌పూర్ ధామ్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 8:10 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. మన్‌కాపూర్, బస్తీ, గోరఖ్‌పూర్, నర్కటియాగంజ్, రక్సౌల్, సీతామఢి, శీషో, మధుబని, జయ్‌నగర్ తదితర స్టేషన్లలో ఈ రైలుకు హాల్టులు ఉన్నాయి. ఈ సేవతో భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు భారత్, నేపాల్ మధ్య ఆధ్యాత్మిక పర్యాటకం, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేదరికం అంటే డబ్బు లేకపోవడం మాత్రమే కాదు - నిర్మలా సీతారామన్‌

పేదరికం అంటే డబ్బు లేకపోవడం మాత్రమే కాదు - నిర్మలా సీతారామన్‌

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భూకంపం

గంగా నది తీరాన్ని శుభ్రం చేసిన విదేశీ మహిళలు.. నెటిజన్ల ప్రశంసలు

గంగా నది తీరాన్ని శుభ్రం చేసిన విదేశీ మహిళలు.. నెటిజన్ల ప్రశంసలు

ఆగ్నేయాసియా దేశాలతో బలమైన మారిటైం భాగస్వామ్యాలు - నారా లోకేశ్‌

ఆగ్నేయాసియా దేశాలతో బలమైన మారిటైం భాగస్వామ్యాలు - నారా లోకేశ్‌

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి రసాయనాల అక్రమ రవాణా?

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి రసాయనాల అక్రమ రవాణా?

రాజమండ్రిలో వినూత్న ప్రచారం: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’

రాజమండ్రిలో వినూత్న ప్రచారం: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’

ట్యాగ్లు
సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్భారత్-నేపాల్ రైలు సేవలుఅయోధ్యజనక్‌పూర్ ధామ్నరేంద్ర మోదీబాలేంద్ర షాఆధ్యాత్మిక పర్యాటకంభారతీయ రైల్వేలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌
సినిమాలు

ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌

పేదరికం అంటే డబ్బు లేకపోవడం మాత్రమే కాదు - నిర్మలా సీతారామన్‌
జనరల్

పేదరికం అంటే డబ్బు లేకపోవడం మాత్రమే కాదు - నిర్మలా సీతారామన్‌

పిఠాపురం జనసేనలో అసమ్మతి.. ఎంపీ పీఏపై దాడి!
రాజకీయాలు

పిఠాపురం జనసేనలో అసమ్మతి.. ఎంపీ పీఏపై దాడి!

ఇండోనేషియాలో భూకంపం
జనరల్

ఇండోనేషియాలో భూకంపం

పట్టాలెక్కిన సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్..!
జనరల్

పట్టాలెక్కిన సరయూ-కమలా ఎక్స్‌ప్రెస్..!

గంగా నది తీరాన్ని శుభ్రం చేసిన విదేశీ మహిళలు.. నెటిజన్ల ప్రశంసలు
జనరల్

గంగా నది తీరాన్ని శుభ్రం చేసిన విదేశీ మహిళలు.. నెటిజన్ల ప్రశంసలు

అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి: పద్మా దేవేందర్ రెడ్డి
రాజకీయాలు

అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి: పద్మా దేవేందర్ రెడ్డి

ఆగ్నేయాసియా దేశాలతో బలమైన మారిటైం భాగస్వామ్యాలు - నారా లోకేశ్‌
జనరల్

ఆగ్నేయాసియా దేశాలతో బలమైన మారిటైం భాగస్వామ్యాలు - నారా లోకేశ్‌

తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదు - మంత్రి కోమటిరెడ్డి
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌కు వ్యతిరేకత లేదు - మంత్రి కోమటిరెడ్డి

బిగ్‌బాస్ తెలుగు 10: డే 78 ప్రోమో 2 విడుదల!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 78 ప్రోమో 2 విడుదల!

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి రసాయనాల అక్రమ రవాణా?
జనరల్

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి రసాయనాల అక్రమ రవాణా?

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ పురోగతి
బిజినెస్

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ పురోగతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!