.png&w=3840&q=75)
సినిమాలు

అమెరికా–దక్షిణ కొరియా సంయుక్త వార్షిక సైనిక విన్యాసాల నేపథ్యంలో ఉత్తర కొరియా మంగళవారం క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. ఒక యుద్ధనౌక నుంచి తన తీరానికి సమీపంలోని దీవుల వైపు ఈ క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం. ఈ ప్రయోగాలను ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు యేతో కలిసి వీక్షించినట్లు ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది.
ఈ క్షిపణి పరీక్షలు ఉత్తర కొరియాపై అణ్వస్త్ర దాడి ముప్పును నిరోధించేందుకు నిర్వహించామని కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. దేశ భద్రతను బలోపేతం చేయడం, శక్తివంతమైన రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శించడం ఈ ప్రయోగాల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అమెరికా–దక్షిణ కొరియా సైనిక విన్యాసాల నేపథ్యంలో ఈ చర్య అంతర్జాతీయ వేదికపై మరోసారి ఉద్రిక్తతలను పెంచింది.
.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!