
సినిమాలు

తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య వీసీకే ప్రధాన కార్యదర్శి చింతనై సెల్వన్ సంచలన ప్రతిపాదన చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు కలిసి వీసీకే అధినేత థోల్ తిరుమావళవన్ను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించాలని ఆయన ఎక్స్ వేదికగా కోరారు.
అభిమానుల బలంపై ఆధారపడిన పాపులిజం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని సెల్వన్ అభిప్రాయపడ్డారు. అనుభవం కలిగిన, అవినీతి రహిత నాయకుడిగా తిరుమావళవన్కు మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు. ఇటీవల ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 సీట్లు సాధించగా, ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీకి స్వల్ప దూరంలో నిలిచింది. అదే సమయంలో వీసీకే డీఎంకే కూటమిలో భాగంగా 2 స్థానాలు గెలుచుకుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!