

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA భారీ విజయాన్ని సాధించడంతో, ఆంధ్రప్రదేశ్లోని NDA భాగస్వాములు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు NDA కి తమ పూర్తి మద్దతు ప్రకటించి, ప్రధాని నరేంద్ర మోదీ మరియు BJP అగ్రనేతలతో బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
తాజా ఫలితాల ప్రకారం, బీహార్లో NDA 243 స్థానాల్లో 204 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. ఈ ఫలితం ఆంధ్రప్రదేశ్లో NDA సాధించిన విజయాన్ని తలపించేలా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ NDA నాయకత్వాన్ని అభినందిస్తూ స్పందించారు. బీహార్ ప్రజలు మోదీ నాయకత్వం పట్ల తన మద్దతు మరోసారి చాటిచెప్పారని, దేశవ్యాప్తంగా NDA పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని వారు పేర్కొన్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంది. విశాఖపట్నం ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతంగా కొనసాగుతూ, భారీ పెట్టుబడులు రాష్ట్రం వైపు ఆకర్షిస్తోంది. బీహార్ నుంచి వచ్చిన విజయవార్తతో NDA వర్గాల్లో మరింత ఉత్సాహం నెలకొంది.









.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!