
జనరల్

హైదరాబాద్కు చెందిన శిశు వైద్య నిపుణురాలు డాక్టర్ శివరంజని సంతోష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పిల్లల ప్రోత్సాహక నగదు పథకంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. రాష్ట్రంలో తగ్గుతున్న జననాల రేటును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో సంతానానికి ₹30 వేల, నాలుగో సంతానానికి ₹40 వేల ప్రోత్సాహక నగదు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ శివరంజని మాట్లాడుతూ పిల్లల పెంపకం అనేది దీర్ఘకాలిక బాధ్యత అని పేర్కొన్నారు. ఆహారం, ఆరోగ్యం, విద్య, నివాసం, భావోద్వేగ పరమైన మద్దతు వంటి అంశాలకు నిరంతర సహాయం అవసరమని తెలిపారు. ఒక్కసారిగా ఇచ్చే నగదు పిల్లల భవిష్యత్తుకు సరిపోదని అభిప్రాయపడుతూ, కుటుంబ సంక్షేమం, ఆరోగ్య అవగాహన, సంతానలేమి చికిత్సలపై ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!