
రాజకీయాలు

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, ఎంపీలు అశోక్ కుమార్ మిట్టల్, సందీప్ పాఠక్ కలిసి బుధవారం ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో కలిశారు. ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన ఈ నేతలు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కక్షపూరిత చర్యలు, అధికార దుర్వినియోగం జరుగుతోందని ఫిర్యాదు చేశారు.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాఘవ్ చద్దా పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హర్భజన్ సింగ్ నివాసం వద్ద ‘దేశద్రోహి’ అంటూ నినాదాలు రాసిన ఘటనను ప్రస్తావించారు. అలాగే రాజేంద్ర గుప్తాకు చెందిన ఫ్యాక్టరీకి నీటి సరఫరా నిలిపివేసినట్లు ఆరోపించారు. సోషల్ మీడియాలో బెదిరింపులకు ప్రత్యేక ఏజెన్సీలను వినియోగిస్తున్నారని కూడా పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!