
సినిమాలు

హైదరాబాద్లో నేడు, రేపు బ్రిక్స్ దేశాల సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య అవినీతి నిరోధక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం ఈ సమావేశాల ప్రధాన లక్ష్యంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో నేరాల నియంత్రణ, పరస్పర సహకారం పెంపొందించే అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు.
పరారీలో ఉన్న నేరస్తుల గుర్తింపు, వారిని ఆయా దేశాలకు అప్పగించే విధానాలపై కూడా సమావేశాల్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 5న టెక్నాలజీ ఆధారిత నైతిక పరిపాలనపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. సాంకేతికత వినియోగంతో పారదర్శక పాలనకు మార్గాలను పరిశీలించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!