
సినిమాలు

లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను నిర్దోషిగా తేలుస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ స్పందించారు. ఈ తీర్పు తీవ్ర నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించేందుకు మహిళా రెజ్లర్లు ఎంతో ధైర్యంతో పోరాడాల్సి వచ్చిందని తెలిపారు.
కొంతమంది మహిళా రెజ్లర్లు ఒత్తిళ్లను ఎదుర్కొంటూ కోర్టులో పోరాటం కొనసాగించారని వినేశ్ ఫోగట్ అన్నారు. కేసు నమోదు అయినప్పటి నుంచి వ్యవస్థ, ప్రభుత్వం బ్రిజ్ భూషణ్కు మద్దతుగా వ్యవహరించాయని ఆరోపించారు. కోర్టు తీర్పుపై అప్పీల్ చేయాలని నిర్ణయించుకున్నామని, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!