

నారాయణపేట్ జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీ లో 6 వ వార్డు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘము కమిషనర్ రాణి కుముదిని మంగళవారం ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ మృతి నేపథ్యంలో ఆ వార్డు ఎన్నికను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11 న జరగనుండగా, ఈ ఘటన ఎన్నికల ముందు రోజు చోటుచేసుకుంది.
ఫిబ్రవరి 9 రాత్రి మక్తల్ మున్సిపాలిటీలో 6 వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యర్థుల వేధింపుల కారణంగానే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో కలకలం రేగగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనకు నిరసనగా హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!