

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా తన రాజకీయ జీవితంలోని అత్యంత భావోద్వేగ క్షణాలను గుర్తుచేసుకున్నారు. 2014లో లోక్‌సభ టికెట్ రాకపోవడంతో తాను రాత్రంతా ఏడ్చానని ఆమె వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మహువా, ఆ సమయంలో తీవ్ర నిరాశలో ఉన్న తనకు అప్పటి టీఎంసీ నేత, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన సువేందు అధికారి అండగా నిలిచారని తెలిపారు. ఆయన ఇచ్చిన ధైర్యం తనలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు.
టీఎంసీలో కలిసి పనిచేసిన రోజుల్లో సువేందు అధికారితో తనకు మంచి వ్యక్తిగత అనుబంధం ఉండేదని మహువా చెప్పారు. తన తొలి ప్రధాన ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన తనకు అండగా నిలిచారని గుర్తు చేశారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాలు కొనసాగుతాయని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుత టీఎంసీ-బీజేపీ రాజకీయ పోటీ మధ్య మహువా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!