10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

Writer: Chandrika 12:52 PM, 10 ఆగస్టు, 2026
మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

హైదరాబాద్‌లో జరిగిన 30వ ఫిల్మ్‌ ఎనలిటికల్‌ అండ్‌ అప్రిసియేషన్‌ సొసైటీ (ఫాస్‌) పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నటుడు మురళీమోహన్‌ ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రతిభను గుర్తించి అందించే పురస్కారాలు కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఎంతో విలువైనవని ఆయన అన్నారు. అవి మరింతగా శ్రమించేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా సినీ కళాకారులను ప్రోత్సహిస్తూ పురస్కారాలు అందిస్తున్న ఫాస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ధర్మారావును మురళీమోహన్‌ అభినందించారు. ఇదే వేదికపై హేమలత పురస్కారాన్ని అందుకున్న సీనియర్‌ నటి అన్నపూర్ణతో కలిసి గతంలో నాటకాల్లో నటించిన జ్ఞాపకాలను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు.

దాసరి నట, రాజకీయ పురస్కారాన్ని అందుకున్న బాబుమోహన్‌.. మంత్రి పదవిలో ఉన్న కాలాన్ని మినహాయిస్తే 42 ఏళ్లుగా నటుడిగా కొనసాగుతున్నానని తెలిపారు. ప్రస్తుతం కూడా పలు సినిమాల్లో నటిస్తున్నానని, తన సినీ ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పారు. ‘మా’ ఉపాధ్యక్షుడు మాదాల రవి ఫాస్‌ సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ, ఎలాంటి స్వార్థం లేకుండా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్న ధర్మారావును అభినందించారు. ఈ వేడుకలో అక్కినేని సెంటినరీ పురస్కారాన్ని శ్రీకాంత్‌, టి.ఎల్‌.కాంతారావు పురస్కారాన్ని నరసింహరాజు, హేమలత పురస్కారాన్ని అన్నపూర్ణ, గీతాంజలి పురస్కారాన్ని హేమ, పండరీబాయి పురస్కారాన్ని రజిత, ప్రత్యేక ప్రశంసా పురస్కారాన్ని సత్యకృష్ణన్‌, రాజబాబు పురస్కారాన్ని అనంత్‌బాబు, జూనియర్‌ వేణుమాధవ్‌ అవార్డును రచ్చ రవి, పద్మనాభం పురస్కారాన్ని గౌతంరాజు, జీవన సాఫల్య పురస్కారాన్ని సీనియర్‌ పాత్రికేయుడు వినాయకరావు అందుకున్నారు. ఉత్తమ సినీ టీవీ పురస్కారం ఈటీవీకి దక్కింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

మెరుపులు, కొండలు, యాక్షన్.. ‘ఇంద్రపుత్ర’పై భారీ అంచనాలు!

మెరుపులు, కొండలు, యాక్షన్.. ‘ఇంద్రపుత్ర’పై భారీ అంచనాలు!

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..

ట్యాగ్లు
మురళీమోహన్‌ఫాస్‌ అవార్డులుఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారంతెలుగు సినిమాటాలీవుడ్‌బాబుమోహన్‌శ్రీకాంత్‌అన్నపూర్ణకె.ధర్మారావుసినీ పురస్కారాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామమందిరం సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు
జనరల్

రామమందిరం సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు
జనరల్

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయాలు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...
జనరల్

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..
సినిమాలు

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?
గాసిప్స్

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..
క్రీడలు

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్
సినిమాలు

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి
జనరల్

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు
రాజకీయాలు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!