

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థి అభిషేక్‌పై 12 మంది తోటి విద్యార్థులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కామారెడ్డికి చెందిన అభిషేక్‌పై కర్రలు, ప్లేట్లతో దాడి చేసి, బూట్లతో ముఖంపై తొక్కినట్లు అతని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడు మెట్లపై నుంచి కిందపడిపోయాడని పాఠశాల యాజమాన్యం ఫోన్‌లో తెలిపిందని, వెంటనే వెళ్లి అతడిని ఇంటికి తీసుకొచ్చామని తల్లిదండ్రులు చెప్పారు.
ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన అభిషేక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు తనపై దాడి చేశారని అభిషేక్ చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు ఘటనను సక్రమంగా బయటకు వెల్లడించలేదని ఆరోపిస్తున్న పాఠశాల యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!