
జనరల్

మద్రాస్ హైకోర్టు ఆదివారం అత్యవసరంగా డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియకరుప్పన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది. ఒక్క ఓటు తేడాతో గెలిచిన టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి విజయం పై ఈ పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాకు సోమవారం అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.
శివగంగ జిల్లా తిరుపత్తూర్ నియోజకవర్గంలో శ్రీనివాస సేతుపతి ఒక్క ఓటు తేడాతో పెరియకరుప్పన్పై విజయం సాధించారు. ఈ ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేసిన డీఎంకే నేత కోర్టును ఆశ్రయించారు.
తన నియోజకవర్గానికి చెందిన పోస్టల్ ఓట్లను వేలూరు సమీపంలోని తిరుపత్తూర్కు తరలించారని పెరియకరుప్పన్ ఆరోపించారు. ఆ ఓట్లను తన నియోజకవర్గానికి చెందినవిగా పరిగణించి మళ్లీ లెక్కించాలని ఆయన కోర్టును కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!