
జనరల్

జడ్ కేటగిరి భద్రతలో ఉన్న మంత్రి నారా లోకేశ్ తన వాహనశ్రేణిని తగ్గించాలని నిర్ణయించారు. కాన్వాయ్‌ను సగానికి కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో లోకేశ్ కాన్వాయ్ కేవలం రెండు వాహనాలకు మాత్రమే పరిమితం కానుంది. కేంద్ర, రాష్ట్ర భద్రతా నిబంధనల ప్రకారం ఎక్కువ వాహనాలు ఉండాల్సి ఉన్నప్పటికీ, స్వచ్ఛందంగా తగ్గించాలని ఆయన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇక సీఎం క్యాంపు కార్యాలయంలో లోకేశ్ నిర్వహించిన అల్పాహార విందుకు పలువురు మంత్రులు సాదాసీదాగా హాజరయ్యారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఎస్కార్ట్ వాహనం లేకుండానే చేరుకోగా, అనిత, సంధ్యారాణి, సవిత, కొల్లు రవీంద్ర, పార్థసారధి, మండిపల్లి, డీఎస్‌బీవీ స్వామి, పయ్యావుల కేశవ్ తదితరులు కూడా ఒక్కో వాహనంలోనే వచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!