

తెలంగాణలో ఇప్పటి వరకు అనేక పార్టీలు వచ్చాయని, ఇప్పుడు అవి ఎక్కడున్నాయో ప్రజలే చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొత్త పార్టీలు వస్తుంటాయని, పోతుంటాయని, వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరిట కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై ఆయన పరోక్షంగా స్పందించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
కేసీఆర్‌పై పలువురు పలురకాలుగా మాట్లాడుతుంటారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువ కాలంగా కొనసాగుతున్నవి తెలుగుదేశం పార్టీ, ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీయేనని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేసిన కేటీఆర్, వ్యక్తిగత దూషణలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇదే సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ప్రజల్లో మార్పు కోరిక పెరుగుతోందని పేర్కొన్నారు.









.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!