
రాజకీయాలు

స్పీకర్ గడ్డం ప్రసాద్ కేసీఆర్ అప్పులపై అబద్ధాలు చెబుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, స్పీకర్ గౌరవాన్ని తగ్గిస్తుందని ఆయన అన్నారు.
ఆర్‌బీఐ, సీఏజీ లెక్కలు అలాగే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన సమాచారం ప్రకారం కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో చేసిన అప్పులు సుమారు రూ.2.80 లక్షల కోట్లేనని కేటీఆర్ తెలిపారు. కానీ స్పీకర్ రూ.8 లక్షల కోట్లు నుంచి రూ.10 లక్షల కోట్లు వరకు వేర్వేరు అంకెలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!