

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ధాన్యం సేకరణ అధ్వానంగా జరుగుతోందని అన్నారు. దళారీలు, అధికారులు, ప్రభుత్వం మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా చేపట్టిన బస్సు యాత్రతోనే రాష్ట్ర ప్రభుత్వంలో కొంత చలనం వచ్చిందని పేర్కొన్నారు.
ధాన్యం సేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసిన కిషన్ రెడ్డి, కేంద్రం ధాన్యం తీసుకోవట్లేదని సీఎం, మంత్రులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఖరీఫ్ సీజన్‌లో 58.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రం-రాష్ట్రం మధ్య ఒప్పందం కుదిరిందని వివరించారు. ప్రభుత్వం కమీషన్లు, రియల్ ఎస్టేట్‌పై ఎక్కువ దృష్టి పెట్టిందని ఆరోపిస్తూ, రైతుల సమస్యలపై సరైన ప్రణాళిక లేకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!