
సినిమాలు

కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారుల సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ చీఫ్గా ఉద్యమకారుల సమస్యలను బలంగా ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం ఉద్యమకారులతో కలిసి సహపంక్తి భోజనం చేసి సంఘీభావం తెలిపారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను జూన్ 2లోపు అమలు చేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పటికీ హామీలు నెరవేర్చకపోతే ఉద్యమకారులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జార్ఖండ్ తరహాలో తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భువనగిరిలో భారీ సభ నిర్వహించడం, భూపోరాటాలను ఉధృతం చేయడం, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించడం వంటి నిర్ణయాలు సమావేశంలో తీసుకున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!