

బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ డీజీపీని కలిశారు. కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం, అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై వారు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, శాంతి భద్రతలను కాపాడాలని పోలీసులను కోరారు.
డీజీపీని కలిసిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, తనపై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కీలక ప్రాంతాల్లో ఘటనలు జరిగినా సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ మధ్య గోప్య ఒప్పందం ఉందని ఆరోపిస్తూ, తాను ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్నందుకే తనపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు కొనసాగితే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!